సినీ వర్గాల్లో కలకలం: గత తొమ్మిది నెలలుగా సినిమాలకు దూరంగా మృణాల్ ఠాకూర్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

గత తొమ్మిది నెలలుగా తాను ఒక్క కొత్త సినిమాకు కూడా సంతకం చేయలేదని ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు నచ్చే అర్థవంతమైన పాత్రలు దొరకలేదని స్పష్టం చేశారు. కేవలం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కాకుండా నటిగా తనకు పూర్తి సంతృప్తినిచ్చే మంచి కథల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె వివరించారు.