విద్యార్థులకు అలర్ట్: ఫిబ్రవరి 24 నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి.రంజిత్ బాషా గురువారం విడుదల చేశారని అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షా సమయమని స్పష్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపారు.