ఏఐపీసీ చైర్మన్ మధుయాస్కీని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నూతన చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఘనంగా అభినందించారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధుయాస్కీ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.