పల్లెపండుగ కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధికి కొత్త ఊపిరి
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పల్లెపండుగ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కందనాతి, కడివెళ్ల, గజులదిన్నె గ్రామాల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. పల్లెల అభివృద్ధి, ప్రజల సౌకర్యమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వారు పేర్కొన్నారు.