ఆసియా క్రీడల భారత పతాకధారిగా పవన్ సెహ్రావత్ ఎంపిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: భారత్

ఆసియా క్రీడల ప్రారంభోత్సవ వేడుకలో భారత పతాకధారిగా కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ ఎంపికయ్యారు. అధికారిక కిట్ అందడంలో జాపకం జరగడంతో షాట్ పుట్ అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్‌కు ఈ అవకాశం దక్కింది. మను భకర్‌తో కలిసి పవన్ సెహ్రావత్ జాతీయ జెండాను పట్టుకుని క్రీడాకారుల బృందాన్ని నడిపించనున్నారు.