ఆర్టీసీ కార్మిక సంక్షేమమే లక్ష్యం: టీఎన్టీయూసీ నేత మణిరాం సింగ్ పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరాం సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికుల ఉద్యోగ భద్రత, ఖాళీ పోస్టుల భర్తీ మరియు కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ కోసం తమ యూనియన్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. మహిళా సిబ్బందికి రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తూ కార్మిక పరిషత్ టైర్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.