కత్తిపూడిలో అక్టోబర్ ఒకటో తేదీన మెగా జాబ్మేళా నిర్వహణ

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: శంఖవరం

కత్తిపూడి సీతారామ జూనియర్ కళాశాలలో అక్టోబర్ ఒకటో తేదీన మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా జరగనుందని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో జాబ్మేళా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వరకు వివిధ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.