వర్షాలతో రమణీయంగా మారిన విశాఖ సింహాచలం కొండ ప్రాంతం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని సింహాచలంలో కురుస్తున్న వర్షాలకు కొండపై సెలయేళ్లు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. సింహగిరిపై మెట్లపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అయితే భక్తుల భద్రత దృష్ట్యా మెట్ల మార్గంలో ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పిచుకధార, ఆకాశధార వంటి ధారలు ఉప్పొంగుతుండగా, ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.