రైతు సమస్యలపై బీఆర్ఎస్ సమరభేరి: కేటీఆర్ ఉత్తర తెలంగాణ పర్యటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ కేంద్రంగా భారీ బహిరంగ సభలు, రైతు గర్జన సదస్సులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్ లో పర్యటనలు నిర్వహించనున్నట్లు వివరించారు. రైతాంగ సంక్షోభంపై పోరాడతామని స్పష్టం చేశారు.