భూముల రీసర్వే పట్టాల పంపిణీ: ముంచంగిపుట్టులో హర్షం వ్యక్తం చేసిన రైతులు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: ముంచింగిపుట్టు

ముంచంగిపుట్టు మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ పరిధిలో గల గ్రామాలలో ఆధునిక పద్ధతిలో రీసర్వే పూర్తి చేసి అర్హులైన రైతన్నలకు అధికారులు నూతన పట్టాలను పంపిణీ చేశారు. గతంలో ఉన్న గొలుసు పద్ధతికి స్వస్తి పలికి భూముల వివరాలను పారదర్శకంగా నమోదు చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.