బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఆర్థిక కష్టాలపై పీవీ సింధు తీవ్ర ఆందోళన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

యూరప్ టోర్నమెంట్లలో భారత షట్లర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా సంస్థల నుండి సరైన మద్దతు లేకపోవడం వల్ల యువ క్రీడాకారుల కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆమె సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ మధ్య ప్రైజ్ మనీలో భారీ వ్యత్యాసం ఉందని పేర్కొంటూ, స్పాన్సర్లు లేని యువ ఆటగాళ్ల కష్టాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.