వినుకొండలో కలకలం: అడవిలో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని కాపాడిన పోలీసులు
రిపోర్టర్: మహేష్
స్థలం: వినుకొండ
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మాలపాడులో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది అడవిలోకి వెళ్లిన వంకాయలపాటి శ్రీను అనే పంతొమ్మిదేళ్ల యువకుడు సోషల్ మీడియాలో తాను చనిపోతున్నట్లు వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. గ్రామస్తులు భయాందోళనకు గురై అడవిలో గాలించగా ఆచూకీ లభించలేదు. వెంటనే అప్రమత్తమైన బండ్లమోటు ఎస్సై సమీర్ భాషా సిబ్బందితో కలిసి ఫోన్ లొకేషన్ ఆధారంగా అడవిలో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని గుర్తించి రక్షించినట్లు వైద్యులు తెలిపారు.