కోలీవుడ్ లోకి టాలెంటెడ్ డైరెక్టర్ ఎంట్రీ: ప్రదీప్ సినిమాలో తరుణ్ భాస్కర్ విలన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించడంతో సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది. షెడ్యూల్స్ క్లాష్ కావడం వల్ల అశ్వత్ మారిముత్తు స్థానంలో తరుణ్ భాస్కర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.