తెలంగాణలో పెట్టుబడులపై ప్రభుత్వ వైఖరి సరికాదంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: హైదరాబాద్

తెలంగాణలో కొత్త కంపెనీలను ఏర్పాటు చేసేందుకు తన స్నేహితుడు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. అమెరికాలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో తన స్నేహితుడి కంపెనీ కూడా ఒకటి అని, ముఖ్యమంత్రితో వాషింగ్టన్ డీసీలో మీటింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నించానని తెలిపారు. ప్రభుత్వం కొత్త పరిశ్రమలను ఫెసిలిటేట్ చేయలేకపోవడంతోనే వాళ్ళు వెనక్కి వెళ్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.