గురుగ్రామ్ బైకర్ కేసు: హత్యాయత్నం సెక్షన్, డ్రైవర్ అరెస్ట్!

రిపోర్టర్: కృష్ణ స్థలం: గురుగ్రామ్

గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో మహిళా బైకర్ సియాను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక మలుపు. తాను మహిళను కాబట్టే కావాలని లక్ష్యంగా చేసుకున్నారని సియా ఆరోపించారు. కారు డ్రైవర్ కళ్యాణ్ బైన్స్లాను రాజస్థాన్‌లో అరెస్టు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నం (సెక్షన్ 109 BNS) కేసు నమోదు చేశారు. "ఇలాంటి వారిని చూస్తే సిగ్గుగా ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్ రోడ్లపై మహిళలకు భద్రత లేదు" అని సియా ఆవేదన వ్యక్తం చేశారు.