తొమ్మిదో తరగతి గణితం సిలబస్పై ఎన్సీఈఆర్టీ కీలక స్పష్టత

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

తొమ్మిదో తరగతి గణితం ముసాయిదా సిలబస్లో ఎలాంటి అంశాలను తొలగించలేదని ఎన్సీఈఆర్టీ అధికారులు స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులలో సామర్థ్యాలను పెంచేందుకే కొత్త పాఠ్యాంశాలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రత్యేక అంశాలను ఇతర చాప్టర్లలో విలీనం చేశామని, అంతేగానీ సిలబస్ నుంచి పూర్తిగా తొలగించలేదని వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిపుణుల నుంచి అందిన సలహాలు, సూచనల ఆధారంగా తుది సిలబస్ను అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.