ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై సుప్రీంకోర్టులో పిటిషన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై క్రిమినల్ విచారణ కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషనర్ల ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, 13 కోట్ల మంది పేర్ల తొలగింపుపై సిట్ తో దర్యాప్తు జరిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఈసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.