దిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ: గోదావరి నిధులపై చర్చ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: దిల్లీ
దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రధానిని ఆయన కోరారు. అలాగే దక్షిణాది నదుల అనుసంధానం చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నరేంద్ర మోదీని గట్టిగా కోరారు.