సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన కడెం మండల విద్యార్థులు
రిపోర్టర్: Radha. A
స్థలం: కడెం
నిర్మల్ జిల్లా కేంద్రంలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వివిధ సాంస్కృతిక అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఈ విజయం పట్ల ఎంఈవో గంగాధర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను ఘనంగా అభినందించారు.