కుస్తీ పోటీల్లో ఐదు స్వర్ణాలతో సత్తా చాటిన నారాయణఖేడ్ విద్యార్థులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నారాయణఖేడ్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మైనారిటీ గురుకుల విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి SGF కుస్తీ పోటీల్లో ఐదు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం చేసుకున్నారు. అండర్-19 విభాగంలో ఫహీం, శివ, అమన్, అయాన్, భూమేష్ బంగారు పతకాలు సాధించగా, రేహాన్ వెండి పతకం సాధించాడు. ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.