భద్రతా సవాళ్లు మారాయంటూ బాగ్డోగ్రాలో వాయుసేన సిబ్బందిని హెచ్చరించిన రానాథ్ సింగ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Bagdogra

యుద్ధ తంత్రాలు పూర్తిగా మారిపోయాయని, సరిహద్దు కాల్పులకే పరిమితం కాకుండా సైబర్ దాడి మరియు డ్రోన్ ముప్పు వంటి కొత్త సవాళ్లు మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీపావళి వేళ పశ్చిమ బెంగాల్ లోని బాగ్డోగ్రా వాయుసేన స్థావరంలో సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులు ప్రత్యక్ష యుద్ధానికి బదులుగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు.