అకాల మరణంతో కన్నీటి సంద్రమైన కుటుంబానికి నేతల పరామర్శ

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన గోపు రాంచెందర్ కుమార్తె ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదారుస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.