కర్నూలులో ఉద్రిక్తత: కారుపైకెక్కి తెదేపా కార్యకర్తలను బెదిరించిన మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

రిపోర్టర్: శివ స్థలం: కర్నూలు

కర్నూలు పాతబస్తీలో వైకాపా మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రెచ్చిపోయారని, ప్రచారంలో భాగంగా తెదేపా కార్యకర్తలపై బెదిరింపులకు దిగారని పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై కారు పైకెక్కి తొడకొట్టి మీసం మెలేస్తూ భయానక వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. పోలీసులు వారించినప్పటికీ వినకుండా తెదేపా శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.