అమెరికా చైనా మైత్రి భవిష్యత్తు భారత్‌పై చూపే ప్రభావం ఏమిటి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య కుదిరిన కొత్త స్నేహబంధం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిందని విదేశాంగ విధాన నిపుణులు బ్రహ్మ చెల్లానీ పేర్కొన్నారు. ఈ రెండు అగ్రరాజ్యాల మైత్రి రాబోయే రోజుల్లో భారత్‌తో పాటు ఆసియా దేశాలపై ఎలాంటి వ్యూహాత్మక ప్రభావం చూపుతుందనే దానిపై విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. వాణిజ్య పరమైన సవాళ్లను అధిగమించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.