పాలమూరు హక్కుల కాలరాస్తే సహించేది లేదు: ఎంపీ డి.కె. అరుణ హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మహబూబ్ నగర్

పాలమూరు రైతాంగ హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. డిండి లిఫ్ట్ రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.