లేపాక్షి పరిధిలో రెండు కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి పరిధిలో నమోదైన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సత్యసాయి పోలీస్ వెల్లడించారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్, సీఐలు జనార్ధన్, కరీంతో కలిసి ఆయన కేసుల వివరాలను మీడియాకు వెల్లడించారు. మహిళ మిస్సింగ్ కేసు మరియు దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.