కివీస్ కు భారీ షాక్: వన్డే సిరీస్ కు రచిన్, చాప్మన్ దూరం
రిపోర్టర్: మహేష్
స్థలం: వెల్లింగ్టన్
టీమిండియాతో వన్డే సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలిందని కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించారు. ప్రధాన బ్యాటర్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ గాయాల కారణంగా ఈ సిరీస్ కు పూర్తిగా దూరమైనట్లు ఆయన స్పష్టం చేశారు. వారిద్దరూ ఫిట్నెస్ సాధించకపోవడంతో బోర్డు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసిందని, టెస్టు సిరీస్ను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని కోచ్ పేర్కొన్నారు.