రేణికుంట గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ చేసిన వ్యక్తి అరెస్ట్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని రేణికుంట గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కోరుకొప్పుల ఆంజనేయులు తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8.1 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తఖియుద్దీన్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.