రామాయణం సినిమాపై రణబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు: ఐదు వేల ఏళ్ల కిందటే మన దగ్గర ఎగిరే కార్లు ఉన్నాయంటూ స్పష్టీకరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ఐదు వేల ఏళ్ల కిందటే మన దేశంలో ఎగిరే కార్లు ఉండేవని ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తెలిపారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ తాజాగా ఫ్లయింగ్ కార్ ను కనిపెట్టారని, అయితే పురాతన కాలంలోనే మన పూర్వీకులు దీనిని రూపొందించారని రణబీర్ పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కానుంది.