ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షల వేళ ఉదయం 6 గంటలకే మెట్రో సర్వీసులు!

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

సెప్టెంబర్ 13న జరగనున్న ఎన్‌డీఏ, సీడీఎస్ 2 పరీక్షల అభ్యర్థుల సౌలభ్యం కోసం ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఉదయం అన్ని మార్గాల్లోనూ సరిగ్గా ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. బ్రిక్స్ సదస్సు కారణంగా ఉన్న ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా డీఎంఆర్సీ ఈ వెసులుబాటు కల్పించింది.