కోయంబత్తూరులో దారుణం: మహిళను కాపాడిన వీధి కుక్కలు
రిపోర్టర్: విజయ్
స్థలం: తమిళనాడు
కోయంబత్తూరు తుడియలూరులో మానసిక స్థితి సరిలేని మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన 17 ఏళ్ల యువకుడిని వీధి కుక్కలు అడ్డుకున్నాయి. మహిళ అరుపులు విన్న కుక్కలు నిందితుడిపై దాడి చేసి, అతడిని పారిపోయేలా చేశాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వీధి కుక్కల ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.