పురుషోత్తపురంలో భారీ బైక్ ర్యాలీతో కదంతొక్కిన కూటమి శ్రేణులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సరుబుజ్జిలి
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ టీడీపీ నాయకులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి కిల్లి ఉమాదేవి, జెడ్పీటీసి అభ్యర్థి సింగుపరుపు దివ్యలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలు ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.