వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు: శివశంకర్‌రెడ్డికి నోటీసులు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. హత్య కోసం వెచ్చించాలనుకున్న రూ.40 కోట్ల మూలాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలకు ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.