ఉరేసుకుని ఉద్యోగి బలవన్మరణం

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

భోగాపురం అపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన బులుసు సందీప్‌ (37) సెజ్‌లోని రసూల్‌ డెక్కర్‌ కంపెనీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నాడు. తోటి ఉద్యోగి సురేష్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం సురేష్‌ విధులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సందీప్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెంది కనిపించాడు. సందీప్‌ తమ్ముడు స్వరూప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరావు తెలిపారు.