నిర్మల్ జిల్లాలో దారుణం: తరగతి గదిలో విద్యార్థిని బంధించిన సిబ్బంది
రిపోర్టర్: రమేష్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబేర ప్రాథమిక పాఠశాలలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని అధికారులు తెలిపారు. తరగతి గదిలో నిద్రపోతున్న భీమ్రావు అనే రెండవ తరగతి విద్యార్థిని గమనించకుండా గదికి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. సాయంత్రం బాలుడి ఏడుపు వినిపించడంతో స్థానికులు తాళం పగులగొట్టి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆదేశాలతో ప్రిన్సిపల్ స్వప్నతో పాటు స్కావెంజర్ను అధికారులు వెంటనే సస్పెండ్ చేశారు.