రామదాసుకండ్రిగలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు సోమిరెడ్డి శ్రీకారం
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.4 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, రూ.11.15 లక్షలతో ప్రహరీని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.