గణపతి మండపం వద్ద అన్నప్రసాద వితరణ
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 7వ వార్డు శ్రీకృష్ణ బాలాజీనగర్లో వినాయక మండపం వద్ద కాలనీ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు కాసర్ల మంజుల శ్రీనివాస్‌రెడ్డి, బద్రి గాలయ్య, గుండెబోయిన ఐలయ్య, పాశం కృష్ణ, దుబ్బాక ఆకాష్‌రెడ్డి, కుడుముల బసవరెడ్డి, కాలనీ నాయకులు దొమ్మటి మధుసూదన్‌రెడ్డి, గడికోట మల్లేశం యాదవ్, కానుగు సతీష్, బెల్లంకొండ నాగేష్, కాస శేఖర్, అంకురి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.