చింతకాని ప్రభుత్వ ఆసుపత్రికి సిరెంజెస్ డొనేట్ చేసిన సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు శనివారం సిరెంజెస్ డొనేట్ చేశారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అల్తాఫ్ తో పాటు చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.