ఓటీటీలోకి కాజల్ అగర్వాల్ సోషియో పొలిటికల్ కోర్ట్ రూమ్ డ్రామా
రిపోర్టర్: సురేష్
స్థలం: India
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో పొలిటికల్ కోర్ట్ రూమ్ డ్రామా ది ఇండియా స్టోరీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా జియో హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంట పొలాల్లో పురుగు మందుల వాడకం వల్ల కలిగే అనర్థాలు మరియు కార్పొరేట్ కంపెనీల మోసాల అంశాలను చర్చిస్తూ లాయర్ అర్చన పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించారు.