కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్కు రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి అవార్డు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కోదాడ

సూర్యాపేట జిల్లా కోదాడ బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి ఎండీ సలీం షరీఫ్ రాష్ట్రస్థాయి ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యా రంగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది.

ఈ ఉత్తమ పురస్కారాన్ని సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయనకు అందజేయనున్నారు. సలీం షరీఫ్ ఎంపిక పట్ల స్థానిక ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.