గుజరాతీ కళను కాపీ కొట్టిన ఫెండి సంస్థపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: India
ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ఫెండి గుజరాతీ సంప్రదాయ కళను కాపీ కొట్టి భారీ ధరకు విక్రయిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా కేవలం రూ.500 విలువైన డిజైన్‌ను రూ.9.5 లక్షలకు విక్రయించడాన్ని పారిశ్రామికవేత్తలు హర్ష్ గోయెంకా, కిరణ్ మజుందార్ షా తీవ్రంగా తప్పుబట్టారు. భారతీయ కళాకారుల ప్రతిభను లగ్జరీ పేరిట దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు.