ఢిల్లీలో నమో శ్రామిక్ సేవా కేంద్రాల ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలో కార్మికుల సంక్షేమం కోసం నమో శ్రామిక్ సేవా కేంద్రాల మొబైల్ వ్యాన్లను ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలోని ప్రతి జిల్లాలోనూ ఒక మొబైల్ వ్యాన్ సేవలు అందిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న అనేక మంది కార్మికులకు ఈ మొబైల్ వ్యాన్లు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి స్పష్టం చేశారు.