'ధరణి భూముల అక్రమాలపై ప్రత్యేక విచారణ': సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ధరణిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో భూములను అక్రమంగా కొల్లగొట్టిన వ్యవహారాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. అసెంబ్లీలో నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ పై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. గత కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన ల్యాండ్ స్కామ్‌లపై ఉక్కుపాదం మోపుతామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు.