పెన్షన్ల హామీపై పాలకులను నిలదీసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో పెన్షన్ అర్హతలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం యాభై ఏళ్లు దాటిన వారికే పెన్షన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు 60 ఏళ్లకు మార్చడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.