కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపడేలా అడుగులు పడుతున్నాయి. పట్టణ అధ్యక్షులు సానమనేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లంకాపట్నం మరియు పద్మావతి నగర్ ప్రాంతాల నుంచి సుమారు ముప్పై కుటుంబాలు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన నూతన సభ్యులను నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నూతన సభ్యులు తెలిపారు.