ఒడిశాలో కపిలాష్ క్షేత్రానికి వెళ్తున్న యువతీయువకులపై దుండగుల దాడి

రిపోర్టర్: హరి స్థలం: Dhankanal

ఒడిశాలోని ధెంకనాల్ జిల్లాలో కపిలాష్ పుణ్యక్షేత్రానికి మోటార్ సైకిల్ పై వెళ్తున్న 26 ఏళ్ల యువకుడు, మరో యువతిని కొందరు దుండగులు అడ్డగించి భయభ్రాంతులకు గురిచేస్తూ దాడి చేశారు. సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. గాండియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిలాష్-తాంగి రోడ్డులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.