బ్లాక్ ఫంగస్‌తో కోమాలోకి వెళ్లిన బాలికి అరుదైన శస్త్రచికిత్స
రిపోర్టర్: సునీల్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో అరుదైన వైద్యం విజయవంతమైంది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కస్తూరికి బ్లాక్ ఫంగస్ సోకి కోమాలోకి వెళ్లగా, వైద్యులు ఐదు గంటల పాటు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. సుమారు రూ.25 లక్షల విలువైన ఈ వైద్య సేవలను ఎన్‌ఆర్‌ఐ యాజమాన్యం పేద తల్లిదండ్రుల పరిస్థితిని గమనించి పూర్తిగా ఉచితంగా అందించింది.