రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తే కఠిన చర్యలుంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరిక

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అమరావతి

అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతిభద్రతలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. జగన్ బెంగళూరులో ఉంటూ రిమోట్ కంట్రోల్తో అరాచకాలు చేయిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రైల్వే చట్టాల తరహాలో కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షిస్తామని ఆయన తేల్చిచెప్పారు.