డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్

రిపోర్టర్: అశోక్ స్థలం: Minnesota

డొనాల్డ్ ట్రంప్ పరిపాలన తనను భయపెట్టాలని చూస్తోందని డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ఆరోపించారు. మినసోటాలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, రాజకీయ ప్రత్యర్థులు తనను అణచివేయాలని చూశారని పేర్కొన్నారు. అయితే ప్రజలు ఓటు ద్వారా తమ సత్తా చాటారని, బెదిరింపులను దీటుగా తిప్పికొట్టారని ఆమె స్పష్టం చేశారు. డెమోక్రట్లు సాధించిన విజయాలు భవిష్యత్ రాజకీయ పోరాటాలకు ఎంతో ఊతమిస్తాయని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.