కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకులకు ముప్పు: నిర్మలా సీతారామన్ నిప్పులు
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా బదులిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇప్పించాయని ఆమె ఆరోపించారు. ఆ విధానాల వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా మొండి బకాయిలు పేరుకుపోయాయని, ఎన్డీయే ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకును అన్ని నిబంధనలను పాటించి తిరిగి గాడిలో పెట్టిందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.